Bigg Boss Siri : బిగ్ బాస్ సిరి బాగోతం బ‌య‌ట‌పెట్టిన బుల్లితెర న‌టుడు..!

November 16, 2021 8:23 PM

Bigg Boss Siri : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇవ్వరు. వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తారనే కామెంట్స్ రెగ్యూలర్ గా వింటూనే ఉంటాం. కానీ తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్ గా తీసుకుంటే ఇబ్బందులు తప్పవంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బుల్లితెర నటుడు నంద కిషోర్.

actor told important things about Bigg Boss Siri

నరసింహపురం అనే సినిమా చేశాడు. సిరి హన్మంత్ యాక్ట్ చేసిన ఈ సినిమాపై నంద కిషోర్.. హీరోయిన్ సిరిపై చేసిన కామెంట్స్ వీడియో.. సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది.

తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు చాలా తక్కువ. అలాంటిది సిరికి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆమెను సినిమా ప్రమోషన్స్ కు పిలిచినప్పుడు రానని అందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ట్రైలర్ లో తన పాత్ర అసభ్యంగా ఉందని, అది చూసిన వారికి నెగెటివ్ అభిప్రాయం వస్తుందని తానే ఊహించుకుందని.. నంద కిషోర్ తెలిపారు.

అయితే ఆ విషయానికి, ప్రమోషన్స్ కు రాకపోవడానికి.. సంబంధం ఏంటో తనకు అర్థం కాలేదని అన్నాడు. తన పాత్ర ముందు ఒకలా చెప్పారని, ఆ తర్వాత మరోలా చూపించారని ఫీలయ్యారట.

సిరి సినిమా చూస్తే.. డైరెక్టర్ ఎంత బాగా చూపించారనే విషయం అర్థమవుతుందని, ఒకవేళ ఆమె సినిమా చూస్తే.. తన అభిప్రాయం కచ్చితంగా మారుతుందని నంద కిషోర్ అన్నారు. బిగ్ బాస్ కి వెళ్ళిన సిరి హన్మంత్ సినీ కెరీర్ పై ఎంతో నమ్మకం పెట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now