ఒక నీచుడు చేసిన పనికి ఆ పిల్లలకు తల్లి దూరమైంది.. ఎవరికీ ఇలా జరగకూడదు..

November 17, 2021 2:02 PM

ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను అమలులోకి తెచ్చినా, ఎంతో కఠినమైన శిక్షలు వేస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్నోరకాల చట్టాల ద్వారా నిందితులు సురక్షితంగా బయటకు రావడం వల్ల ఎన్నో దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారు.

that children lost their mother because of one man

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని భవానా ప్రాంతంలో రెండు వారాల క్రితం ఒక మహిళపై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఆ వివాహితపై యాసిడ్ దాడి జరగడానికి కారణమేమిటనే విషయానికి వస్తే..

ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ 26 ఏళ్ల వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త రోజు కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మొంటూ అనే 23 సంవత్సరాల యువకుడు ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతను ఒత్తిడి చేయడంతో.. ఆమె.. నాకు పెళ్లి అయింది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, పెళ్లయిన మహిళను ఇష్టపడటం మంచి పద్ధతి కాదు.. అంటూ అతనికి అర్థమయ్యేలా వివరించింది.

అయితే ఆమె నవంబర్ 3వ తేదీన బయటకు వెళ్లిన సమయంలో మొంటూ అడ్డుపడి తనను పెళ్లి చేసుకోవాలని మరోమారు ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే ఆమె చాలా గట్టిగా అతనికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ముందుగానే ఆమెపై యాసిడ్ దాడి చేయాలని పథకం వేసుకుని అతను తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ క్రమంలో స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె భర్త ముందుగా తనకు ఒక్క మాట చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇన్ని రోజులూ తన బిడ్డలు అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగితే వస్తుంది అని చెప్పాను ఇప్పుడు వారికి నేనేమి సమాధానం చెప్పాలి, ఏంటి మాకు ఈ పరీక్ష.. అంటూ విలపించాడు. ఇక విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో అతనిని కఠినంగా శిక్షించాలని, అతనికి ఉరి శిక్ష పడేలా చేయాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now