Horoscope : నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త..!

November 16, 2021 10:16 AM

Horoscope : ఈ ఏడాదిలో నవంబర్ 19వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు జ్యోతిష్యలు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు వచ్చే ఈ చంద్రగ్రహణం ఎంతో శుభకరమైనదని వారు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది.

Horoscope because of lunar eclipse these zodiac signs will effect

అయితే కేవలం రెండు రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు మనదేశంలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మరి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. అనే విషయానికి వస్తే..

వృషభ రాశి : నవంబర్ 19వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణ ప్రభావం వృషభ రాశి వారిపై అధికంగా ఉంటుంది. ఇప్పటికే వృషభ రాశిలో రాహువు ఉండటం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని.. పండితులు చెబుతున్నారు.

సింహరాశి : చంద్ర గ్రహణం కృత్తిక నక్షత్రంలో ఏర్పడటంవల్ల ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కనుక చంద్రగ్రహణం ప్రభావం సూర్యుడితో సంబంధమున్న అన్ని రాశులపై పడుతుంది. ముఖ్యంగా సింహ రాశి వారిపై ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ గ్రహణం ప్రభావం వల్ల సింహ రాశివారు అయోమయ పరిస్థితులలోకి వెళ్ళిపోతారు. ఉన్నతాధికారుల నుంచి ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోయే సూచనలు కూడా కనిపిస్తాయి. కనుక వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now