Chethana : అమ్మ మ‌ళ్లీ పుట్ట‌బోతుందంటూ.. ఎమోష‌న‌ల్ అయిన ఉత్తేజ్ కూతురు..!

November 16, 2021 3:59 PM

Chethana : నటుడిగానే గాక రచయితగా ఎంతో టాలెంట్ ఉన్న ఉత్తేజ్.. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ లాంటి సినిమాలకు సంభాషణలు రాసిన ఆయన.. మొత్తం 200 కు పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవ‌ల ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి అనారోగ్యంతో క‌న్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో అందర్నీ కలచివేసింది. మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ హాస్పటల్‌కు వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

uttej daughter Chethana shared her baby bump photo

ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు చేతన ఉత్తేజ్, పాట. పెద్దమ్మాయి చేతన బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. చిన్న కూతురు పాట‌కి కూడా మంచి టాలెంట్ ఉంది. రీసెంట్‌గా అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అందరినీ ఆకర్షించింది.

నటుడు ఉత్తేజ్‌ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది.

కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింద‌ని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే.. అని పేర్కొంది. చేత‌న‌.. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు ఉత్తేజ్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now