Madhavi Latha : నాగార్జునను అప్పడం అంటూ.. పరువు మొత్తం తీసిన మాధవీలత..!

November 15, 2021 10:30 PM

Madhavi Latha : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించేవారు కార్యక్రమంలో ఎవరు తప్పులు చేస్తే వారిని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ ఈ సీజన్లో నాగార్జున శైలి మాత్రం ఎంతో భిన్నంగా ఉంది. కేవలం బిగ్ బాస్ నిర్వాహకులు రాసిన స్క్రిప్టు ప్రకారమే వచ్చి అవే మాటలు అక్కడ చెప్పి వెళ్ళిపోతున్నట్లు స్పష్టమవుతోంది.

Madhavi Latha satires on nagarjuna over bigg boss episode

తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సన్నీ గురించి మాట్లాడిన మాటలు అతని అభిమానులను ఎంతో కలచివేశాయి. కేవలం సన్నీ తప్పు మాత్రమే జరిగిందని భావించి నాగార్జున సన్నీని ప్రశ్నించారు. అయితే ఇందులో సన్నీ తప్పు ఎంత ఉందో సిరి, షణ్ముఖ్‌ తప్పు కూడా అంతే ఉంది. నాగార్జున వారిని ప్రశ్నించకుండా కేవలం సన్నీని మాత్రమే తిట్టారు. ఇలా నాగార్జున పక్షపాతం చూపించడంతో చాలామంది నెటిజన్లతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం నాగార్జునను ఏకిపారేస్తున్నారు.

ఈ క్రమంలోనే నటి మాధవి స్పందిస్తూ.. తగలబెట్టండి సార్.. అప్పడం.. అనే పదాన్ని.. అన్ పార్లమెంటరీ పదంగా ఉపయోగించి ఇవాళ నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి. అప్పడం అంటే అమ్మాయి అని.. తాజాగా సీనియర్ హీరో నాగార్జున తెలియజేశారు కనుక ఇకపై ఎవరూ అప్పడం తినకండి.

అదేవిధంగా అప్పడం అమ్మే కంపెనీలను కూడా బ్యాన్ చేయండి. అప్పడం అనేది ఒక పెద్ద బూతు పదం కనుక ఎవరూ అప్పడం అమ్మవద్దు.. తినొద్దు.. కొనొద్దు.. అంటూ నాగార్జునపై తనదైన శైలిలో సెటైర్లు వేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Madhavi Latha : నాగార్జునను అప్పడం అంటూ.. పరువు మొత్తం తీసిన మాధవీలత..!”

Leave a Comment