Preetham : ఏంటి ప్రీతమ్.. ఒకేసారి చిరు కూతురిని.. అంత మాట అనేశావు..!

November 15, 2021 10:15 PM

Preetham : డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఇతని పేరు ఎక్కువగా వినిపించింది. సమంతతో అతనికి సంబంధం ఉండటం వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై సమంత సన్నిహితులు స్పందిస్తూ.. ప్రీతమ్.. సమంతను అక్క అని పిలుస్తాడని.. వారిద్దరి మధ్య అలాంటి అక్రమ సంబంధం అంటగట్టకండి.. అంటూ కోరారు.

Preetham jukalkar comments on sreeja

ఇక సమంత కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేసింది. అయితే ప్రీతమ్ కేవలం సమంతకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలకు స్పెషల్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రీతమ్ పేరు పాపులర్ అయ్యింది. ఇంతకీ ఇతను మళ్లీ ఏం చేశాడు ? అంటే..

తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పుట్టినరోజు కావడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆ పోస్టు చూసిన ప్రీతమ్.. సుందర్ లడికీ.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తూ.. ఏంటి ప్రీతమ్ అంత మాట అనేశావు.. అయినా మెగా కుటుంబంతో మరీ అంత చనువు ఏంటి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవును మరి.. పెద్ద కుటుంబాలతో చనువుగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ తేడా వస్తే మాత్రం భవిష్యత్తు మొత్తం మారిపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment