Chaurasia : కేబీఆర్ పార్క్ ద‌గ్గ‌ర న‌టిపై దాడి చేసి.. మొబైల్ ఎత్తుకెళ్లిన దుండ‌గుడు..!

November 15, 2021 10:17 AM

Chaurasia : హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కేబీఆర్ పార్క్‌కి ఓ విశిష్టత ఉంది. ఎంతో ఆహ్ల‌దంగా ఉండే ఈ పార్క్‌కి నిత్యం చాలా మంది వాకింగ్‌కి వ‌స్తూ ఉంటారు. సెల‌బ్స్ కూడా ఈ పార్క్‌లో వాకింగ్ తో పాటు ప‌లు వ్యాయామాలు చేస్తుంటారు. అయ‌తే ఇక్క‌డ ప‌లుమార్లు దాడులు జరిగిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ న‌టిపై దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు ఓ దుండ‌గుడు.

Chaurasia got attacked by an unknown person and she lost her mobile

వాకింగ్‌ కు వెళ్లిన సినీనటి చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నటి చౌరాసియా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద చౌరాసియా ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లింది. అక్కడ ఓ దుండగుడు తనపై దాడిచేశాడు.

ఆమె డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు వాకింగ్ కి వెళ్లే వారిలో భ‌యాందోళ‌నలను క‌లిగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now