వైరల్ గా మారిన మై విలేజ్ షో అనిల్ వెరైటీ పెళ్లి పత్రిక.. అన్ని అందులోనే!

April 30, 2021 2:02 PM

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి ఎటువంటి ముహూర్తాలు లేకపోవడంతో వచ్చే నెలలో కొన్ని లక్షల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి.ఈ విధంగా రోజు కేసులు పెరుగుతున్న క్రమంలో కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకోక మరి కొందరు కేవలం కొంతమంది సమక్షంలోనే పెళ్లి జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మై విలేజ్ షో అనిల్ తన పెళ్లి కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు.

అనిల్ పెళ్లికి వేయించిన శుభలేఖలోనే అన్నింటిని వివరించాడు. పెళ్లి ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా ఉండాలి, కట్నకానుకలు ఎలా వేయాలి అనే విషయాలన్నింటిని పెళ్లి పత్రికలోనే రూపొందించాడు. సాధారణంగా పెళ్లి పత్రికలు శ్రీరస్తు.. శుభమస్తు అని మొదలవగా అనిల్ పెళ్లి పత్రిక మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటూ కరోనా నిబంధనలను తెలియజేశాడు.

ఇక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పేరు కింద చదువు క్వాలిఫికేషన్ లో కరోనా నెగిటివ్ అని రాయించారు. పెళ్లి ని ఆన్లైన్ లో చూసే విధంగా,కట్నకానుకలు కూడా డిజిటల్ పద్ధతిలో చెల్లించే విధంగా పెళ్లి పత్రిక పై బార్ కోడ్ కూడా ప్రింట్ చేశారు. తన పెళ్ళికి వచ్చే కట్నకానుకలు కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తామని పెళ్లి పత్రికలు వివరించాడు. ఈ విధంగా అనిల్ తన పెళ్లి విభిన్న పద్ధతిలో చేసుకోవడంతో ఈ పెళ్లి పత్రిక కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అని పెళ్లి పత్రికపై రాసి నవ్వించే ప్రయత్నం చేసిన అందులో నిజం ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment