Natu Natu Song : నాటు నాటు సాంగ్.. హాలీవుడ్ సాంగ్‌కి కాపీయా..!

November 14, 2021 7:32 PM

Natu Natu Song : సోష‌ల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక త‌ప్పొప్పులు ఈజీగా తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా సినిమాల‌కు సంబంధించిన ఏ విష‌యమైనా కాపీ చేసినట్టు అనిపిస్తే వెంట‌నే సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. రాజ‌మౌళి సినిమాల‌కు కాపీ ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డం చాలా స‌హజం. ఇప్పుడు ఆయ‌న విడుద‌ల చేసిన రీసెంట్ సాంగ్ నాటు నాటు కూడా కాపీ అని అంటున్నారు.

Natu Natu Song is it copy to hollywood song

ఈ సాంగ్‌ని పూర్తిగా ఆఫ్రికన్ మూవీ నుంచి మక్కీ టూ మక్కీ కాపీ కొట్టేసిన సాంగ్ అంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే సాగుతోంది. అనుకూల, ప్రతికూల కామెంట్స్ తో అటూ ఇటూ అదరగొడుతున్నారు. ఇంతకీ నాటు సాంగ్ మూలమైన ఆఫ్రికన్ సాంగ్ ఎలా ఉంటుంది అంటే.. అక్కడ కూడా ఇద్దరు నటులు ఇదే రకంగా కాస్ట్యూమ్స్ వేసుకుని ఒకే తీరున స్టెప్స్ వీర లెవెల్లో వేస్తారు. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి ఆ సాంగ్ చూసి ఇలా తీశాడని అంటున్నారు.

రాజ‌మౌళి గ‌తంలో నాని హీరోగా పెట్టి తీసిన ఈగ మూవీ కూడా కాక్రోచ్ అనే మూవీకి కాపీ అంటూ పాత విషయాలు గుర్తు చేస్తున్నారు. బాహుబలి మూవీ పోస్టర్ కూడా ఒక ఇంగ్లీష్ మూవీ పోస్టర్ కి కాపీ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇప్ప‌టికే నాటు నాటు పాట‌కు ఫుల్ క్రేజ్ ద‌క్క‌గా,ఈ నెగెటివ్ ప్ర‌చారం కూడా సినిమాకి చాలా ఉపయోడ‌ప‌డుతుంద‌ని కొంద‌రు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now