శుక్రవారం ఉప్పు దానం చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

February 23, 2022 4:48 PM

శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా శుక్రవారం అమ్మవారికి పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలను కల్పిస్తుందని భావిస్తారు. అయితే శుక్రవారం అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే మనం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.

అమ్మ వారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజున మురికి బట్టలు, మాసిన బట్టలను ధరించకూడదు. అమ్మ వారికి ఎంతో ఇష్టమైన రోజు రాళ్ల ఉప్పును కుప్పగా పోసి అందులో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్టైశ్వర్యాలను కల్పిస్తుంది.

శుక్రవారం ఎట్టి పరిస్థితులలో కూడా మన ఇంటి నుంచి రాళ్ల ఉప్పును ఇతరులకు దానం చేయకూడదు. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావిస్తారు కనుక రాళ్ల ఉప్పు దానం చేస్తే లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి పంపినట్లు లెక్క. అదే విధంగా శుక్రవారం ఉప్పును కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం మన ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టకూడదు. ఆడపిల్లలు లేదా మగ వారు శుక్రవారం జుట్టు కత్తిరించకూడదు. ఈ విధమైనటువంటి పనులకు దూరంగా ఉన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలను పొందగలమని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now