Natu Natu Song : సోహైల్, మెహ‌బూబ్‌ల నాటు నాటు వెర్షన్ కేక పెట్టిస్తుందిగా..!

November 14, 2021 1:20 PM

Natu Natu Song : దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నంగా ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు రాజ‌మౌళి. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. జ‌న‌వ‌రి 7న చిత్రం విడుదల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు.

Natu Natu Song  mehboob and sohel crazy dance steps

రీసెంట్‌గా చిత్రం నుండి విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది. తారక్- చెర్రీ మెరుపు లాంటి డ్యాన్స్ మూమెంట్స్, అదరగొట్టే కీరవాణి ట్యూన్లు… జక్కన్న మేకింగ్ వ్యాల్యూస్.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైర‌వ పాట.. నాటునాటు పాట‌ను ఆల్‌రౌండర్ పాటగా మార్చేశాయి. నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ అవుతోందీ పాట. ఈ పాట‌కు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంద‌రు డ్యాన్స్‌లు చేస్తున్నారు.

లేటెస్ట్‌గా ఓ బామ్మ ఈ పాట‌కు స్టెప్పులేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. దీనిపై ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేం సోహెల్, మెహ‌బూబ్ కూడా చాలా జోష్‌తో నాటు నాటు పాట‌కు హుషారెక్కించే స్టెప్పులు వేశారు. ప్ర‌స్తుతం వారి డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now