Sreemukhi : వంటలక్కగా మారిన శ్రీముఖి..! అదరగొడుతుందా ?

November 13, 2021 11:40 AM

Sreemukhi : బుల్లితెరపై వంటల కార్యక్రమాలకు ఎంతో క్రేజ్ ఏర్పడుతోంది. ఈ కార్యక్రమాలకు ఉన్న క్రేజ్ వల్ల ఏకంగా స్టార్ హీరోయిన్లు సైతం యాంకర్ లుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా మాస్టర్ చెఫ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసింది. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఎవరికి వారు వంటల కార్యక్రమాలు చేస్తూ ఆహా ఏమి రుచి అనిపిస్తున్నారు.

Sreemukhi to do cooking program in aha platform

ఇదివరకే ఆహా యాప్ ద్వారా మంచు లక్ష్మి ఆహా ఏమి రుచి అంటూ కొందరు సెలబ్రిటీలను పిలిపించి వారితో వివిధ రకాల వంటలు చేయించడం మాత్రమే కాకుండా వారితో కలిసి చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అలా ఆహా ఏమి రుచి కార్యక్రమం ద్వారా మంచు లక్ష్మి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా శ్రీముఖి వంతు వచ్చింది. ప్రస్తుతం ఆహా యాప్ ద్వారా శ్రీముఖి మరొక వంటల కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే చెఫ్ మంత్ర అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో భాగంగా శ్రీయ, సుహాన్, రెజీనాలతో కలిసి సందడి చేయబోతోంది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయం చెప్పకుండానే కమింగ్ సూన్ అంటూ ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now