Swara Bhaskar : నీ కంటే మా ప‌ని మ‌నిషి అందంగా ఉందంటూ.. హీరోయిన్‌పై సెటైర్..!

November 12, 2021 10:40 PM

Swara Bhaskar : సోష‌ల్ మీడియాలో సెలబ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రు నెటిజ‌న్స్ దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ అని కూడా చూడ‌కుండా వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు. హీరోయిన్స్ దృష్టిని ఆకర్షించేందుకు గాను కొందరు చేసే ప్రయత్నాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలాంటి సమయంలో చాలా మంది హీరోయిన్స్ అలాంటి నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోరు. కొంద‌రు మాత్రం తెలివైన స‌మాధానాలు ఇస్తుంటారు.

Swara Bhaskar reply to a netizen who commented her that she is not attractive

తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్వ‌ర భాస్క‌ర్.. ఓ నెటిజ‌న్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. వివ‌రాల‌లోకి వెళితే.. ఒక నెటిజన్.. స్వర భాస్కర్ ఇటీవల షేర్ చేసిన ఫొటోకు.. చీరలో నీ కన్నా మా పనిమనిషి అందంగా ఉంటుంది.. ఆమె నీ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.. అంటూ కామెంట్ పెట్టాడు. చీర కట్టులో ఏమాత్రం బాగుండవు.. అంటూ స్వరా భాస్కర్ ను అతడు డైరెక్ట్ గా అంత మాట అనేశాడు.

నెటిజ‌న్ మాట‌ల‌కు మాములు వాళ్ల‌యినా కోప్పడడం స‌హజం కానీ స్వ‌ర భాస్క‌ర్ మాత్రం అత‌డికి హుందాగా బ‌దులు ఇచ్చింది. మీరు అన్నట్లుగా మీ పని మనిషి చీరలో చాలా బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నాను. ఆమె చేసే పనికి.. ఆమె మీకు ఇచ్చే సర్వీస్ కు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమెతో మర్యాదగా వ్యవహరిస్తారని.. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ, చులకనగా ఆమెను చూడరని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. స్వ‌ర భాస్క‌ర్ కామెంట్స్‌పై అందరూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్ లను షేర్ చేసే స్వర భాస్కర్ ఇలాంటి కామెంట్స్ చాలా సార్లు ఫేస్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now