Brahmanandam : బ్ర‌హ్మానందం ఏంటి.. ఇలా అయిపోయారు..!

November 12, 2021 6:06 PM

Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కొన్ని సినిమాలు బ్రహ్మానందం కామెడీకే సూపర్ హిట్ అయ్యాయి అంటే ఆయన ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అర్థమవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణంగా బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలలో నటించడం లేదు.

Brahmanandam looks very different because of health issues

తాజాగా హరీష్‌ వడత్యా దర్శకత్వంలో శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఇందులో బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా బ్రహ్మానందం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో బ్రహ్మానందం సినిమా గురించి మాట్లాడుతూ.. తనని ఒక కమెడియన్ గా కూడా చూడకుండా ఎంతో కీలకపాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారు అంటూ వెల్లడించారు. అయితే ఈ వీడియోలో బ్రహ్మానందాన్ని చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈయన అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శరీరం మొత్తం వదులుగా మారిపోయి ఉండడంతో చాలామంది బ్రహ్మానందం ఏంటి ఇలా మారిపోయారు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now