T20 World Cup 2021 : పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం.. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌తో ఢీ..!

November 11, 2021 11:23 PM

T20 World Cup 2021 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై గెలిచిన ఆస్ట్రేలియా ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. పాక్ నిర్దేశించి ల‌క్ష్యాన్ని ఆసీస్ సుల‌భంగానే ఛేదించింది. ఓవైపు వికెట్ల‌ను కోల్పోయిన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ ఆసీస్‌ను రక్షించారు. ధాటిగా ఆడుతూ ప‌రుగులు తీశారు. దీంతో చివ‌ర్లో బౌండ‌రీలు తోడ‌య్యాయి. ఈ క్ర‌మంలో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup 2021 australia won by 5 wickets against pakisthan in 2nd semi final and enter into final

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌ను కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌ల‌లో మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌, బాబ‌ర్ ఆజ‌మ్‌లు రాణించారు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో రిజ్వాన్ 67 ప‌రుగులు చేయ‌గా, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో జ‌మాన్ 55 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ 34 బంతుల్లో 5 ఫోర్ల‌తో 39 ప‌రుగులు చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్‌, ఆడ‌మ్ జంపాలకు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 177 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 49 ప‌రుగులు చేయ‌గా, మార్క‌స్ స్టాయినిస్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 40 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ మ్యాథ్యూ వేడ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 41 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌డ‌మే కాక‌.. ఆసీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా ఫైన‌ల్స్‌కు చేరుకుంది.

ఇక ఇప్ప‌టికే ఇంగ్లండ్ మీద గెలిచిన న్యూజిలాండ్ ఫైన‌ల్‌కు చేరుకోగా.. ఆ జ‌ట్టుతో ఆసీస్ త‌ల‌ప‌డ‌నుంది. కివీస్, ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ ఈనెల 14వ తేదీన దుబాయ్‌లో జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ జ‌రుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now