Nagarjuna : బిగ్ బాస్ షోలో నాగార్జున ధ‌రించిన ఈ ష‌ర్ట్ ఖ‌రీదు ఎంతో తెలుసా ?

November 11, 2021 7:36 PM

Nagarjuna : సినీ న‌టుడు నాగార్జున ఓ వైపు బిగ్ బాస్ షో చేస్తూనే మూవీల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ షోకు వారాంతాల్లో నాగార్జున వ‌స్తుండ‌డంతోనే ఆ షో ఆ మాత్రంగానైనా న‌డుస్తోంది. వీక్ డేస్‌లో అస్స‌లు రేటింగ్సే ఉండ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే షో గ‌డుస్తున్న కొద్దీ అందులో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా ? అని ప్రేక్ష‌కులు ప్ర‌తి వారం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

do you know about Nagarjuna shirt price

ఇక షోలో భాగంగా నాగార్జున భిన్న ర‌కాల డ్రెస్‌లు వేసుకుని క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఓ ఎపిసోడ్‌లో భాగంగా ఓ ష‌ర్ట్ వేసుకుని వ‌చ్చారు. దీంతో ఆయ‌న ధ‌రించిన ష‌ర్ట్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ (Etro Paisley Silk Shirt)లో క‌నిపించారు. ఈ ష‌ర్ట్ ధ‌ర 310 డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో రూ.23వేలు అన్న‌మాట‌.

ఇక నాగార్జున వేసుకున్న ఈ ష‌ర్ట్‌పై చాలా మంది భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఆయ‌న ఈ వ‌య‌స్సులో ఇలాంటి ష‌ర్ట్స్ వేసుకోవ‌డం అవ‌స‌ర‌మా ? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి కొంద‌రు.. సెల‌బ్రిటీలు క‌దా, వారు ధ‌రించే డ్రెస్‌ల ఖ‌రీదు అలాగే ఉంటుంది.. అని కామెంట్ చేస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రంలో న‌టించ‌గా.. అది అంతగా ఆక‌ట్టుకోలేదు. త్వ‌ర‌లో ఆయ‌న ది ఘోస్ట్‌తో సంద‌డి చేయ‌నున్నారు. అలాగే ప్ర‌స్తుతం బంగార్రాజు అనే మూవీ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now