Faria Abdullah : జాతిర‌త్నాలు హీరోయిన్‌కు గొప్ప చాన్స్‌..?

November 11, 2021 3:05 PM

Faria Abdullah : ఫ‌రియా అబ్దుల్లా.. ఈ పేరును ఎవ‌రికీ ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. జాతిర‌త్నాలు సినిమా హీరోయిన్ అంటే ఎవ‌రికైనా ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఆ మూవీ మంచి టాక్‌ను సంపాదించుకున్నా.. ఈమెకు మాత్రం పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. కానీ తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈమె ఓ మూవీకి హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది.

Faria Abdullah reportedly got a chance in manchu vishnu movie

మంచు విష్ణు, శ్రీ‌ను వైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం అటు మంచు విష్ణుతోపాటు ఇటు ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల కూడా హిట్ కోసం చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ఢీ అండ్ ఢీ అనే మూవీని ఢీ మూవీకి సీక్వెల్‌గా తీసే ప‌నిలో ప‌డ్డారు. దాంతో అయినా హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు.

ఇక మంచు విష్ణు, శ్రీ‌ను వైట్ల తీస్తున్న ఢీ సీక్వెల్‌లో ఫ‌రియా అబ్దుల్లాకు హీరోయిన్ చాన్స్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దీంతో ఈ అమ్మ‌డు పంట పండింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆ మూవీ హిట్ అయితే గ‌న‌క ఈమెకు అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌చ్చే చాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి విష్ణు, శ్రీ‌ను వైట్ల‌తోపాటు ఈమె భ‌విష్య‌త్తు ఈ కొత్త మూవీతో ఎలా మారుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now