3 Roses Series : ఆహాలో మ‌రో వెబ్ సిరీస్.. న‌వంబ‌ర్ 12 నుంచి.. ఈషా రెబ్బా, పాయ‌ల్ రాజ్‌పూత్‌, పూర్ణ‌..!

November 11, 2021 2:29 PM

3 Roses Series : తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా దూకుడు మీద ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మూవీల‌ను అందులో రిలీజ్ చేస్తూనే మ‌రోవైపు టాక్ షోలు, వెబ్ సిరీస్‌ల‌ను లాంచ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆహాలో ఇంకో కొత్త వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంది. 3 రోజెస్ పేరిట ఆ వెబ్‌సిరీస్ న‌వంబ‌ర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

3 Roses Series streaming on aha platform from november 12th

3 రోజెస్‌కు చెందిన ట్రైల‌ర్‌ను ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేసింది. ఇందులో ఈషా రెబ్బా, పాయ‌ల్ రాజ్ పూత్‌, పూర్ణ‌, వైవా హ‌ర్ష‌, ప్రిన్స్ వంటి వారు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఒక పెళ్లి విష‌యంలో మ‌హిళ‌లు ఏ విధంగా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు అనే క‌థాంశంతో ఈ సిరీస్‌ను నిర్మించారు. త‌ల్లిదండ్రుల బల‌వంతంతో కాకుండా యువ‌తి త‌న ఇష్ట ప్రకారం, త‌న‌కు న‌చ్చిన అభిరుచులు ఉన్న వ్య‌క్తిని పెళ్లి చేసుకునే చాయిస్‌ను ఆమెకు క‌ల్పించాల‌ని.. ఇందులో చూపించారు. ఈ క్ర‌మంలో ఈ సిరీస్ ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నారు. ఈ సిరీస్‌కు మ్యాగీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now