Kangana Ranaut : కాబోయే భ‌ర్త గురించి త్వ‌ర‌లోనే చెబుతానంటున్న కంగ‌నా..!

November 11, 2021 1:55 PM

Kangana Ranaut : కంగ‌నా ర‌నౌత్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని వార్త‌ల్లో నిలుస్తుంటుంది. గ‌తంలో సుశాంత్ సింగ్ మ‌రణంపై ఈమె బాలీవుడ్ మొత్తాన్ని విమ‌ర్శించింది. బంధుప్రీతి ఎక్కువ‌ని, క‌ష్ట‌ప‌డి పైకి ఎదిగే వారిని తొక్కేస్తార‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. అయితే కంగ‌నా వ్య‌వ‌హార శైలి చూస్తే ఆమె ప‌రోక్షంగా బీజేపీ ప్ర‌భుత్వానికి ఎప్పుడూ మ‌ద్ద‌తుగా నిలుస్తుంటుంది.

Kangana Ranaut says she will tell about her would be husband

కంగ‌నా ఇటీవ‌లే నాలుగోసారి జాతీయ ఉత్త‌మ నటిగా అవార్డును అందుకోవ‌డంతోపాటు రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమె ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని కూడా అందుకుంది. ఇక తాజాగా ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆమె త‌న మ‌న‌స్సులో ఉన్న విష‌యాల‌ను మీడియ‌తో షేర్ చేసుకుంది.

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాన‌ని కంగ‌నా చెప్పుకొచ్చింది. త‌న‌కు విజ‌యం సాధించేందుకు 8-9 ఏళ్లు ప‌ట్టింద‌ని, అయినా విడిచిపెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక న‌టిగా తాను ఎంతో సాధించాన‌ని చెప్పిన కంగ‌న‌.. పెళ్లిపై అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. తాను క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాన‌ని, వైవాహిక జీవితాన్ని గ‌డ‌పాల‌ని, పిల్ల‌ల్ని క‌నాల‌ని ఉంద‌ని కూడా చెప్పింది. అయితే త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి మాత్రం చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాన‌ని చెప్పింది. మ‌రి ఆ ల‌క్కీ మ్యాన్ ఎవ‌రో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now