Mahesh Babu : శ్రీమంతుడు స్పూర్తితో జ‌రిగిన పాఠ‌శాల నిర్మాణం.. త‌న టీంను తీసుకొని అక్క‌డికి వ‌స్తానంటూ మ‌హేష్ హామీ..

November 10, 2021 7:28 PM

Mahesh Babu : బీబీపేట మండల కేంద్రంలో దాత సుభాష్​రెడ్డి శ్రీమంతుడు చిత్ర స్పూర్తితో రూ.6 కోట్లు పెట్టి కట్టించిన హైస్కూల్​ బిల్డింగ్​ను మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ‘‘చాలామంది దగ్గర పైసలుంటయి. కానీ సేవకు ముందుకు రారు. సుభాష్ రెడ్డి తాను చదివిన స్కూలుకు కొత్త బిల్డింగ్ ​కట్టించడం అభినందనీయం” అన్నారు కేటీఆర్‌.

Mahesh Babu said he will definitely visit that school

తన నాయనమ్మ ఊరు బీబీపేట మండలం కోనాపూర్​ గవర్నమెంట్​ స్కూల్​ను శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో డెవలప్ చేస్తామని కేటీఆర్ చెప్పారు. బీబీపేటకు జూనియర్​ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే శ్రీమంతుడు స్పూర్తితో స్కూల్ నిర్మాణం జ‌రిగింద‌ని తెలుసుకున్న మ‌హేష్ స్పందించారు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సుభాష్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక మేం అక్కడికి వస్తామని మహేష్ బాబు త‌న ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.

సుభాష్ రెడ్డి కొడుకు నేహాంత్ శ్రీమంతుడు సినిమా చూసి ఇలా కట్టించాలని అన్నాడట. దాంతో సుభాష్ ఆరు కోట్లు పెట్టి క‌ట్టించాడు. అయితే ఆ పాఠశాలను కేటీఆర్ ప్రారంభించారు.

ఇక్కడకు వచ్చాక తనకు ఆ విషయం తెలిసిందని.. లేదంటే మహేష్ బాబునే ఈవెంట్‌కు తీసుకొచ్చే వాడినని కేటీఆర్ అన్నారు. జూనియర్ కాలేజ్ కడుతున్నారు కదా ? అది పూర్తయిన తరువాత అప్పుడు మహేష్ బాబు తీసుకొద్దాం. ఆయన వస్తే ఇంకా పది మందికీ ఈ విషయం తెలుస్తుంది.. అని కేటీఆర్ ఈ స‌మావేశంలో మాట్లాడారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now