Master Chef : అన‌సూయ క‌న్నా త‌మ‌న్నానే బెట‌రా ? మాస్ట‌ర్ చెఫ్ రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి..!

November 10, 2021 2:13 PM

Master Chef : టీవీ షోల నిర్వాహ‌కులు రేటింగ్స్ కోసం ఎన్నో చేస్తుంటారు. సెల‌బ్రిటీల‌ను తీసుకువ‌చ్చి సంద‌డి చేస్తుంటారు. ప్రోమోల‌తో అద‌ర‌గొడుతుంటారు. అయితే షోలో ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన వినోదం లేక‌పోతే వారు చూడ‌రు. దీంతో రేటింగ్స్ గ‌ణ‌నీయంగా ప‌డిపోతుంటాయి. ఈ క్ర‌మంలో అలాంటి షో ల‌ను ఆపేస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం ఇలాంటి పరిస్థితే మాస్ట‌ర్ చెఫ్‌కు వ‌చ్చిందా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

Master Chef ratings down tamanna is better than anasuya

మాస్ట‌ర్ చెఫ్‌లో ముందుగా త‌మ‌న్నాను యాంక‌ర్‌గా తీసుకున్నారు. కొన్ని రోజులు షో బాగానే న‌డిచింది. రేటింగ్స్ కూడా బాగానే వ‌చ్చాయి. కానీ ఏమైందో తెలియ‌దు, రేటింగ్స్ స‌డెన్‌గా ప‌డిపోయాయి. దీంతో త‌మ‌న్నాను త‌ప్పించిన నిర్వాహ‌కులు ఆమె ప్లేసులో అన‌సూయను తెచ్చి ప‌డేశారు.

త‌మ‌న్నా అయితే ఎక్కువ మొత్తం ఇవ్వాలి క‌దా. అన‌సూయ అయితే త‌క్కువ రెమ్యున‌రేష‌న్ ఇచ్చినా స‌రిపోతుంది, పైగా రేటింగ్స్ పెద్ద‌గా లేవు, రెవెన్యూ రావ‌డం లేదు.. అనుకున్న నిర్వాహ‌కులు త‌మ‌న్నాకు బ‌దులుగా అన‌సూయ‌ను యాంక‌ర్‌గా మార్చారు.

అయితే నిజానికి ఇప్పుడు రేటింగ్స్ ఇంకా ప‌డిపోయాయి. త‌మ‌న్నా ఉన్న‌ప్పుడే అంతో ఇంతో బెట‌ర్‌గా ఉన్న రేటింగ్స్ ఇప్పుడు ఇంకా ప‌డిపోయిన‌ట్లు తాజాగా వ‌చ్చిన బార్క్ రేటింగ్స్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏం చేయాలా ? అని షో నిర్వాహ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ విష‌యంలో ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now