Allu Arjun : అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్‌టీసీ షాక్‌.. కించపరిచారంటూ సజ్జనార్‌ నోటీసులు జారీ..!

November 9, 2021 8:47 PM

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ నోటీసులు పంపారు. బ‌న్నీ ర్యాపిడో అనే ప్ర‌క‌ట‌న‌లో న‌టిస్తుండ‌గా, ఈ ప్ర‌క‌ట‌న‌లో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని బ‌న్నీ పేర్కొన్నాడు. దీనిపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి.

Allu Arjun got legal notice from telangana rtc md sajjanar

ఈ క్ర‌మంలో స‌జ్జనార్ బ‌న్నీకి నోటీసులు పంపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోన్న టీఎస్‌ఆర్‌టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యంతోపాటు ఎవ‌రూ హ‌ర్షించ‌డం లేదు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్‌ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్‌ నోటీసు ఇచ్చింది. బస్‌ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్‌, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం.. అని సజ్జనార్‌ తెలిపారు.

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా, అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌చిత్రంతో బిజీగా ఉండ‌గా ఈ చిత్రం డిసెంబ‌ర్17న విడుద‌ల కానుంది. ఇందులో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now