Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను వదలని ఫైనాన్స్ కష్టాలు!

November 9, 2021 12:54 PM

Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఫిల్మ్ టీమ్ ఫిక్స్ చేసింది. ఇక అఖండ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు భంగం కలిగేలా చేస్తున్నాయనేది సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా ఫిల్మ్ టీమ్ మొదలుపెట్టారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు బిజినెస్ తగ్గింది. ఈ విషయంలో ముఖ్యమైన ఒప్పందాలపై కూడా కొన్ని సంతకాలు జరిగాయి. అలాగే సినిమా టికెట్ల ధరల్లో కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఎంతోమంది అనుకున్నారు. కానీ నిర్మాణ సంస్ధలు ఇవేమీ చేయలేదు.

Akhanda movie is getting financial toubles

ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు ఈ ధరలకు సినిమాను రిలీజ్ చేయడం కష్టమని.. ఈ ధరల్లో 25 నుండి 30 శాతం వరకు తగ్గింపును కోరుతున్నట్లు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ల ధరలపై వారు రూ.25 కోట్ల వరకు అంగీకరిస్తున్నట్లు సమాచారం. కనుక ఈ సారి ధరల విషయంలో సినిమా దాదాపుగా 10 కోట్ల రూపాయల నష్టానికి అమ్మేసే పరిస్థితికి చేరుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్స్ కి అస్సలు ఒప్పుకోవట్లేదు. దీనికి తోడు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో ఉన్నారు.

ఈ సినిమా కోసం బోయపాటి సైతం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం మంచి ధరలకు సినిమా అమ్మినా.. థియేట్రికల్ భారం దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఉంటుందని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి.. గతంలో బోయపాటి సినిమాలతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళారు. ఇప్పుడు అఖండ విషయంలో కూడా అదే జరిగితే పరిస్థితి మరింత కష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ విషయంపై నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now