Samantha : స‌మంత‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ త‌గ్గిందా ? ఊపిరి పీల్చుకుంటోందా ?

November 9, 2021 8:01 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత‌ను నెటిజ‌న్లు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. త‌ప్ప‌తంతా ఆమెదే అన్న‌ట్లు ఆమెను విప‌రీతంగా ట్రోల్ చేశారు. అయితే కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి.. ఆమె గ‌ర్భం తీయించుకుంద‌ని, స‌రోగ‌సీ కోసం సిద్ధ‌మైందని.. ఆమె వ్య‌వ‌హార శైలి అక్కినేని కుటుంబానికి న‌చ్చ‌లేద‌ని.. అందువ‌ల్లే విడాకులు తీసుకుంటున్నార‌ని.. ఆ విష‌యాల‌ను త‌మ‌కు వారు చెప్పిన‌ట్లుగా క‌న్‌ఫాం చేస్తూ వీడియోల‌ను పోస్ట్ చేశారు. దీంతో స‌మంత‌కు చిర్రెత్తుకొచ్చింది.

trolling on Samantha may be stopped she is finally peaceful

అలా త‌న‌పై చెడు ప్ర‌చారం చేసిన యూట్యూబ్ చాన‌ల్స్‌పై ఆమె కోర్టులో న‌ష్ట‌ప‌రిహారం దావా వేసింది. అందులో ఆమె విజ‌యం సాధించింది. దీంతో ఆ చాన‌ల్స్ వారు క్ష‌మాప‌ణ‌లు చెప్పి ఆ వీడియోల తాలూకు లింక్‌ల‌ను తీసేశారు. ఆ త‌రువాత కోర్టు కూడా వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు చెందిన వివ‌రాల పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌వ‌ద్ద‌ని స‌మంత‌కు సూచించింది. అది అయిపోయిన విష‌యం.

ఆ త‌రువాత స‌మంత ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్ల‌డం, ఇత‌ర టూరిస్టు ప్లేస్‌ల‌కు వెళ్ల‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఈ మ‌ధ్య‌లోనే ప‌లు సినిమాల‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అయితే కోర్టు కేసులు అవ‌డం ఏమోగానీ.. స‌మంత‌పై వ‌స్తున్న ట్రోలింగ్ కొంత వ‌ర‌కు ఆగింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇది ఆమె సాధించిన విజ‌య‌మేన‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు.

వాస్త‌వానికి ఆమె ఆ విష‌యంపై కోర్టుకు వెళ్ల‌క‌పోయినా.. కొంత కాలం ఓపిక ప‌డితే అంతా అదే స‌ద్దుమ‌ణుగుతుంది. ఈ విష‌యాన్ని ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆమెకు చెప్పారు. అయినా ఆమె విన‌కుండా కోర్టు కేసుల దాకా వెళ్లింది. స‌రే.. ఏదైతేనేం.. కొన్ని రోజులుగా స‌మంత‌పై వ‌స్తున్న ట్రోలింగ్ చాలా వ‌ర‌కు త‌గ్గింది. ఆమెను విమర్శించ‌డం లేదు. యూట్యూబ్ చాన‌ల్స్ కూడా గ‌మ్మున ఉన్నాయి. బ‌హుశా ఇంకా ఏమైనా వీడియోలు పెడితే మ‌ళ్లీ కేసుల దాకా వెళ్లాల్సి వ‌స్తుంది.. ఎందుకు రా బాబూ.. అనుకున్నారేమో.. దీంతో కొన్ని రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో స‌మంత పేరు పెద్ద‌గా వినబ‌డ‌డం లేదు.

కార‌ణాలు ఏమున్నా స‌మంత‌పై వ‌స్తున్న ట్రోలింగ్‌, విమ‌ర్శ‌లు చాలా వ‌ర‌కు త‌గ్గాయ‌నే చెప్ప‌వ‌చ్చు. దీంతో ఆమె కాస్తంత ఊపిరి పీల్చుకోనుంది. అయితే ఫ్యాన్స్ ఏ విష‌యాన్ని అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు మ‌ళ్లీ ట్రోలింగ్ మొద‌లు పెడ‌తారు. మ‌రి స‌మంత అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందే.. ఏం చేస్తుందో చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now