T20 World Cup 2021 : నమీబియాపై భార‌త్ విజ‌యం.. టీ20ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్ బై..!

November 8, 2021 10:50 PM

T20 World Cup 2021 : దుబాయ్‌లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 42వ మ్యాచ్‌లో న‌మీబియాపై భార‌త్ విజ‌యం సాధించింది. నమీబియా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై భార‌త్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 india won by 9 wickets against namibia in 42nd match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 132 ప‌రుగులు చేసింది. న‌మీబియా బ్యాట్స్‌మెన్‌ల‌లో డేవిడ్ వెయిస్ 26 ప‌రుగులు, స్టీఫెన్ బార్డ్ 21 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజాలు చెరో 3 వికెట్ల చొప్పున తీశారు. బుమ్రాకు 2 వికెట్లు ద‌క్కాయి.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ 15.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్‌ను మాత్ర‌మే కోల్పోయి 136 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్‌, రోహిత్ శ‌ర్మ‌లు అర్ధ సెంచ‌రీల‌తో రాణించారు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో రాహుల్ 54 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో రోహిత్ 56 ప‌రుగులు చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ 25 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. న‌మీబియా బౌల‌ర్ల‌లో జాన్ ఫ్రైలింక్ 1 వికెట్ తీశాడు.

కాగా ఇప్ప‌టికే సెమీ ఫైన‌ల్ బెర్త్‌లు ఖ‌రారు అయిన నేప‌థ్యంలో భార‌త్ ఆడిన ఈ మ్యాచ్ ఎలాంటి ప్ర‌భావం చూప‌దు. ఈ మ్యాచ్‌తో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీలో ప్ర‌ధాన రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి. సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

వ‌ర‌ల్డ్ క‌ప్ అనంత‌రం టీ20ల‌కు కెప్టెన్‌గా త‌ప్పుకుంటాన‌ని కోహ్లి ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. దీంతో కోహ్లి భార‌త టీ20 జ‌ట్టుకు కెప్టెన్‌గా త‌ప్పుకున్నాడు. కేవ‌లం బ్యాట్స్‌మెన్‌గానే కొన‌సాగ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now