Bigg Boss 5 : శ్రీ‌రామ్ కు నంబ‌ర్ వ‌న్ ప్లేస్ ఇచ్చిన విశ్వ‌.. ఏడుస్తూ చెప్పేశాడు..!

November 8, 2021 2:01 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా తుది ద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే హౌజ్ నుండి 9 మంది హౌజ్‌మేట్స్ బ‌య‌ట‌కు రాగా, ప్ర‌స్తుతం 10 మంది మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఎవ‌రు టాప్ 5లో ఉంటార‌నే చ‌ర్చ గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తోంది. అయితే ఎవ‌రి అభిప్రాయాలు వారు చెబుతుండ‌గా, ఆదివారం ఎలిమినేట్ అయిన విశ్వ ఉన్న ప‌ది మందికి ఎవ‌రి స్థానం ఏంటో చెప్పాడు. ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్‌ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్‌ ఇచ్చాడు.

Bigg Boss 5 vishwa given number one place to sriram while crying

కాజల్‌ను తొమ్మిదో స్థానంలో పెట్టేశాడు. ఆటలో తన మీద తనకే నమ్మకాన్ని కోల్పోతోంది. తనది తాను కోల్పోతోంది. జెస్సీ మధ్యలో ఆటను వదిలేస్తున్నాడని ఎనిమిదో స్థానంకే పరిమితం చేశాడు. గేమ్‌లో గివప్‌ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. అనీ ఫైటర్‌ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. మానస్‌ను ఆరో స్థానంలో పెట్టేసిన విశ్వ.. గెలుపోటములు ఒకేలా తీసుకోలేడని చెప్పాడు. సిరి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉంది.. ఏమున్నా కూడా మొహం మీదే చెబుతుందంటూ ఐదో స్థానంలో పెట్టేశాడు.

స‌న్నీకి నాలుగో స్థానం ఇచ్చిన విశ్వ‌.. ఫైర్ మెయింటైన్ చేయాల‌ని అన్నాడు. ఇక ష‌ణ్ముఖ్‌కి మూడో స్థానం ఇస్తూ.. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఉండడం గొప్ప విషయం అన్నాడు. ఇక రవిని అందరూ గుంటనక్క అంటారు. కానీ అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అవసరం లేకపోయినా కూడా వెళ్లి చెబుతాడు. ఇకపై అలా చేయకు అంటూ రెండో స్థానాన్ని ఇచ్చాడు. శ్రీరామ‌చంద్ర‌కు తొలి స్థానం ఇచ్చిన విశ్వ‌.. నిన్ను చూస్తే నా త‌మ్ముడు గుర్తొస్తాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. మనసులో ఏముంటే అదే చెబుతాడు.. నటించడు అంటూ శ్రీరామ్‌ పై ప్ర‌శంస‌లు కురిపించాడు విశ్వ‌. మరి విశ్వ ఇచ్చిన ర్యాంకుల ప్రకారమే బిగ్‌ బాస్‌ కొనసాగుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now