T20 World Cup 2021 : ఆఫ్గ‌నిస్థాన్ ఓడింది.. భార‌త్ ఇంటికే..!

November 7, 2021 6:50 PM

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 40వ మ్యాచ్‌లో ఆఫ్గ‌నిస్థాన్‌పై న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఫ్గ‌నిస్థాన్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయాసంగానే ఛేదించింది. కాక‌పోతే ఆచి తూచి ఆడింది. ఈ క్ర‌మంలో ఆఫ్గ‌నిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 newzealand won by 8 wickets against afghanisthan in 40th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గ‌నిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆఫ్గ‌న్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో న‌జీబుల్లా జ‌ద్రాన్ ఒక్క‌డే రాణించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అత‌ను 73 ప‌రుగులు చేశాడు. మిగిలిన ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు. కివీస్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టిమ్ సౌతీ 2 వికెట్లు తీయ‌గా, ఆడ‌మ్ మిల్నె, జేమ్స్ నీష‌మ్‌, ఇష్ సోధిలు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18.1 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 125 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌, డేవాన్ కాన్‌వేలు రాణించారు. 42 బంతుల్లో 3 ఫోర్ల‌తో విలియ‌మ్స‌న్ 40 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా.. కాన్‌వే 32 బంతుల్లో 4 ఫోర్ల‌తో 36 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆఫ్గ‌న్ బౌల‌ర్ల‌లో ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌, ర‌షీద్ ఖాన్‌లు చెరొక వికెట్ తీశారు.

కాగా ఈ మ్యాచ్ లో ఆఫ్గ‌నిస్థాన్ గెలిచి ఉంటే భార‌త్ సెమీస్‌కు వెళ్లి ఉండేది. కానీ ఇందులో ఆఫ్గ‌నిస్థాన్ ఓట‌మి పాలైంది. దీంతో భార‌త్ ఇంటి బాట ప‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. ఇంకో మ్యాచ్ న‌మీబియాతో ఉంది. కానీ అందులో నెగ్గినా పాయింట్ల ప‌ట్టిక‌లో 3వ స్థానంలోనే ఉంటుంది. సెమీస్‌కు వెళ్ల‌దు. క‌నుక వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఇంకో మ్యాచ్‌తో నిష్క్రమిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 2007 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో తొలి రౌండ్‌లోనే భార‌త్ వెన‌క్కి తిరిగి వ‌స్తుండ‌డం.. ఇది రెండోసారి. కాగా భార‌త్‌కు ఇప్ప‌టికే హెడ్ కోచ్‌గా ర‌విశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్ నియామ‌కం అయ్యాడు. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రావిడ్ ఆ ప‌దవిలో కొన‌సాగ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now