Balakrishna : బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో.. బాగానే ఉంది.. కానీ..?

November 7, 2021 6:36 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ మొట్ట మొద‌టి సారిగా ఆహాలో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ద్వారా సంద‌డి చేశారు. ఈ షోకు విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. షోకు చెందిన ఎపిసోడ్ ప్రోమోలు విడుద‌ల చేయ‌గానే ట్రెండింగ్ గా మారాయి. బాల‌కృష్ణ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఏ విధంగా యాక్ట్ చేస్తారో అంద‌రికీ తెలుసు. కానీ టాక్ షో ద్వారా బుల్లి తెరపై ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇస్తారోన‌ని ఆడియెన్స్ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు.

Balakrishna unstoppable with nbk is good but there is some dissatisfaction

అయితే అంచ‌నాల‌కు త‌గిన విధంగానే మొద‌టి ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేశారు. మంచు మోహ‌న్ బాబు, ల‌క్ష్మి, విష్ణులు హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు.. ప‌లు ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌పై చ‌ర్చించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఇంకా ఏదో త‌గ్గిన‌ట్లు అనిపిస్తోంద‌ని.. ఫ్యాన్స్ అంటున్నారు.

టాక్ షోల‌లో చూసేందుకు ఏముంటుంది. సెల‌బ్రిటీల‌కు చెందిన వ్య‌క్తిగ‌త జీవితాల గురించి చ‌ర్చించుకుంటారు. స‌హ‌జంగానే ఆడియెన్స్‌కు ఆ విష‌యాలు అంటే ఆస‌క్తి ఉంటుంది. క‌నుక ఎలాగూ చూస్తారు. అయితే బాల‌య్య షో నుంచి ఆడియ‌న్స్ ఇంకాస్త ఫ‌న్‌, జోష్‌ను ఆశించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే షో ప్రారంభ‌మైంది ఇప్పుడే క‌నుక‌.. రెగ్యుల‌ర్ టాక్ షో కాకుండా ఇంకా కొద్దిగా ఫ‌న్‌, జోష్ ఉంటే.. రేటింగ్స్ ను బాగానే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. క‌నుక నిర్వాహ‌కులు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తే మంచిద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి బాల‌య్య రానున్న ఎపిసోడ్స్‌లో ఇంకాస్త జోష్ పెంచుతారో, లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now