Virat Kohli : విరాట్ గురించి అనుష్క ఎమోష‌న‌ల్ కామెంట్.. నువ్వేంటో గ‌ట్టిగా అరిచి చెప్పాల‌ని ఉంది..!

November 6, 2021 12:09 AM

Virat Kohli : బాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో అనుష్క శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ జంట ఒకటి. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జంట డిసెంబరు 11న ఇటలీ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ద్వారా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఈ అందమైన జంటకు 2021, జనవరి 11న కూతురు వామికా జన్మించింది. ప్ర‌స్తుతం అనుష్క.. కూతురు బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతోంది.

anushka sharma message to Virat Kohli on his birth day

ఇక నవంబర్‌ 5న ఇండియ‌న్ క్రికెట్ స్టార్ విరాట్‌కోహ్లీ త‌న 33వ పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న భార్య అనుష్క శ‌ర్మ పోస్ట్ చేసిన పోస్ట్ మాత్రం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. త‌న‌దైన ప్రేమ నిండిన మ‌న‌సుతో, ఎమోష‌నల్ క‌ల‌గ‌లిపి సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుష్క త‌న పోస్ట్‌లో పేర్కొంది.

ఈ ఫొటోకు ఎలాంటి మెరుగులు అక్కర్లేదు. ఉక్కు సంకల్పం.. నిజాయితీతో కూడినది నీ వ్యక్తిత్వం. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా లెక్క చేయక ముందుకు వెళ్లే ధైర్యం నీ సొంతం. నీలా చీకటి నుంచి అత్యున్నత శిఖరాలకు చేరగల వ్యక్తి మరొకరు ఉండరని నాకు తెలుసు. నీ మనసులో భయానికి తావులేదు. రోజురోజుకీ నువ్వు ఎదుగుతున్న విధానం అమోఘం. సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు.

https://www.instagram.com/p/CV4iyW_JcnS/

కొన్నిసార్లు నాకు బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది.. నీ అంతటి అత్యద్భుత వ్యక్తి మరొకరు లేరని ఈ ప్రపంచానికి చాటిచెప్పాలని ఉంటుంది. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రకాశవంతంగా.. మరింత అందంగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్‌’’.. ఒక భార్యకు భర్తపై ఉన్న ప్రేమను తెలియ‌జేసింది. అనుష్క పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now