Squid Game : రికార్డులను తిరగరాస్తున్న స్క్విడ్‌ గేమ్ సిరీస్‌..!

November 6, 2021 12:04 AM

Squid Game : స్క్విడ్‌ గేమ్ ..ఇప్పుడు ఏ దేశంలో చూసినా ఈ వెబ్‌ సిరీస్‌ గురించే చర్చ. సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ విడుదలైన 90 దేశాల్లో నం.1గా కొనసాగుతోంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. అక్టోబరు 17 నాటికి స్క్విడ్‌గేమ్‌ విడుదలై సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ సిరీస్‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా 3 బిలియ‌న్ నిమిషాల పాటు వీక్షించార‌ట‌.

Squid Game creating sensation world wide

మార్వెల్ ‘బ్లాక్ విడో’ నీల్సన్ టాప్ 10 మూవీస్‌ విభాగంలో నంబర్ 1 స్లాట్‌లోకి వచ్చింది. ‘బ్లాక్ విడో’ జూలై 9న విడుదలైంది. కాగా, స్క్విడ్ గేమ్ మొదటి సీజన్‌లో మొత్తం 8 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉంది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ వల్ల కొత్తగా చాలా మంది కొత్త చందాదారులు వచ్చి చేరారు. దీంతో సెప్టెంబర్ 17న “స్క్విడ్ గేమ్” విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగింది.

ప్రపంచాన్ని కోవిడ్‌ కుదిపేశాక ‘స్క్విడ్‌గేమ్‌’ కథపై అందరి దృష్టి పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ హక్కులు తీసుకొని నిర్మించింది. ఇందులోని మొత్తం తొమ్మిది ఎపిసోడ్లని దర్శకుడే తెరకెక్కించాడు. ఆయన నిజజీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దీన్ని మరింత బలంగా రాయడానికి తోడ్పడ్డాయి. అమెరికాతోపాటు మిగతా అన్నిదేశాల్లోనూ ట్రెండింగ్‌లో ఉంది ఈ సిరీస్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now