Bigg Boss 5 : ర‌విని టార్చ‌ర్ పెడుతున్నారు.. ఆవేద‌న వ్య‌క్తం చేసిన అషూ రెడ్డి..

November 5, 2021 9:36 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే 60 రోజులు పూర్త‌య్యాయి. హౌజ్‌లో 11 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఎవ‌రు ట్రోఫీ అందుకుంటారో అని లెక్క‌లు మొద‌లు పెట్టేశారు. అయితే ప్ర‌స్తుతం హౌజ్‌లో ఇంటి స‌భ్యులు ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఎవ‌రు ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారు.. అనే దానిపై జోరుగా చర్చ‌లు న‌డుస్తున్నాయి.

Bigg Boss 5 ashu reddy sympathy on ravi

కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్‌లో హీరోస్ టీం విల‌న్ టీంకి సంబంధించిన ర‌విని టార్గెట్ చేయ‌డం, ఆయ‌న‌కు వెన్ను నొప్పి అని తెలిసినా కూడా టార్చ‌ర్ పెట్ట‌డం ఆయన అభిమానుల‌కి బాధ‌ని క‌లిగించింది.

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అషూ రెడ్డి కూడా ఫైర్ అయింది. ర‌వికి వెన్ను నొప్పి అని తెలిసి కూడా వాళ్లు అత‌డిని టార్గెట్ చేస్తున్నారు. అది అక్క‌డ క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది. దీన్ని టార్చ‌ర్ అంటారు, కానీ గేమ్ అన‌రు’ అని మండిపడింది. ఆమెను ప‌లువురు స‌పోర్ట్ చేస్తున్నారు.

టాస్క్‌లో భాగంగా ర‌వికి మిక్స్‌డ్ జ్యూస్‌ను తాగాల‌ని చెప్ప‌గా ర‌వి గుట‌గుటా తాగేశాడు. డ్రింక్ తాగిన వెంట‌నే స్క్వాడ్స్ చేయమ‌న్నారు. ర‌వికి బ్యాక్ పెయిన్ ప్రాబ్ల‌మ్ ఉంది, కాబ‌ట్టి ఆ టాస్క్ చేయ‌న‌ని చేతులెత్తేస్తాడ‌నుకున్నారు, కానీ ర‌వి వెన‌కడుగు వేయ‌లేదు. దాన్ని కూడా విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత మ‌రో ర‌కం జ్యూస్ తాగించి గుండ్రంగా తిప్పించారు. ఆయ‌న‌తో క్విట్ చేయించాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ వారి వ‌ల్ల కాలేదు. ఎట్ట‌కేల‌కు ఈ టాస్క్‌లో ర‌వి విజ‌యం సాధించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now