F3 : డబ్బులు, బంగారంతో పట్టుబడ్డ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌..!

November 4, 2021 6:31 PM

F3 : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ‘ఎఫ్‌ 2’ ప్రేక్షకుల్ని ఎంతగా నవ్వించిందో అంతకుమించిన ‘ఫన్‌’ పంచేందుకు ‘ఎఫ్‌ 3’ సిద్ధమవుతోంది.

F3 fun and frustration poster launched

ప్రముఖ నటుడు సునీల్‌ రాకతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్‌’, ‘రూలర్‌’ తదితర చిత్రాల్లో సందడి చేసిన సోనాల్‌ చౌహాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. సినిమా న‌వ్వుల విందును పంచ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితోపాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేమిటి.. అనేది ఈ సినిమా కథ అంటున్నారు.

అప్పులు తీర్చడానికి పడే తిప్పలను ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్‌లో వ‌రుణ్ చేతిలో డ‌బ్బులు పట్టుకొని ఉండ‌గా, వెంక‌టేష్ గోల్డ్ ప‌ట్టుకున్నాడు. బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే మనకు నవ్వుల పండగ అని మేక‌ర్స్ ఇప్ప‌టికే ఒక ప్ర‌క‌ట‌న చేయ‌గా, డ‌బ్బుల నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now