Bigg Boss 5 : ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ది.. ఈ ముగ్గురే..!

November 4, 2021 2:23 PM

Bigg Boss 5 : బుల్లితెరపై బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. వారం వారం జ‌రిగే ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలా మంది ఈ వారం నామినేష‌న్‌ల‌లో ఉండ‌డంతో ఈ వారాంతంలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు ? అని ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వోటింగ్ జ‌రుగుతున్న విధానం, కంటెస్టెంట్ల‌ను ఎలిమినేట్ చేస్తున్న తీరు, వారు ఇంట్లో గేమ్ ఆడుతున్న విధానాల‌ను ప‌రిశీల‌స్తూ ప్రేక్ష‌కులు ఎవ‌రికి వారే ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని ఒక అంచ‌నాకు వ‌స్తున్నారు.

Bigg Boss 5 these three are in danger zone this week

ఇక గ‌త ఎలిమినేష‌న్లు, ప్ర‌స్తుత ఓటింగ్ విధానం వంటి అంశాల‌ను చూస్తే ఈ వారం ముగ్గురు కంటెస్టెంట్లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. హౌస్‌లో ప్ర‌స్తుతం 11 మంది మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో కాంపిటీష‌న్ మ‌రింత ఎక్కువ‌వుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆర్‌జే కాజ‌ల్ ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఆమెకు వ‌స్తున్న ఓట్ల‌ను బ‌ట్టి కాకుండా.. ఆమె ఇంట్లో స‌భ్యుల‌తో ఎలా ఉంటుంది ? అన్న విష‌యంపైనే ఆమె డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమెను ఇంట్లోని చాలా మంది కంటెస్టెంట్లు వ్య‌తిరేకిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే చాన్స్‌లు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు.

ఇక విశ్వ‌, జెస్సీ ఇద్ద‌రూ కూడా ఈ వారం డేంజ‌ర్ జోన్‌లోనే ఉన్నారు. విశ్వ స్ట్రాంగ్ అయిన‌ప్ప‌టికీ అత‌ను ఆడుతున్న గేమ్ ప్రేక్ష‌కుల‌కు అర్థం కావ‌డం లేదు. దీంతో అది విశ్వ‌కు మైన‌స్ అవుతుంద‌ని అంటున్నారు. అందువ‌ల్ల అత‌ను కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయంటున్నారు.

అలాగే మ‌రో కంటెస్టెంట్ అయిన జెస్సీ కూడా ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఉన్నాడు. అత‌ని ఆరోగ్యం బాగా లేనందున చాలా వ‌ర‌కు టాస్క్‌ల‌కు దూరంగా ఉన్నాడు. దీంతో ఇది అత‌నిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే జెస్సీ కూడా ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment