Peddanna Movie Review : పెద్ద‌న్న రివ్యూ.. అంత‌గా పేల‌ని మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌..

November 4, 2021 12:10 PM

Peddanna Movie Review : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ప్రేక్ష‌కుల‌లో ఏ రేంజ్ అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న సినిమాల‌పై పిచ్చ క్రేజ్ ఉంటుంది. రజినీకాంత్ ఈ దీపావళికి ‘పెద్దన్న’గా అందరి ముందుకొచ్చారు. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్, లేడీ సూపర్ స్టార్ నయనతారతోపాటు సీనియర్ బ్యూటీ మీనా కీలక పాత్రల్లో నటించారు.

Peddanna Movie Review not so much entertaining

త‌మిళంలో అన్నాత్తెగా రూపొందిన ర‌జ‌నీ చిత్రం తెలుగులో పెద్ద‌న్న‌గా రిలీజ్ అయింది. ఇందులో రజినీ వన్ మ్యాన్ షో కనబరిచారు. బ్రదర్ – సిస్టర్ రిలేషన్ సెంటిమెంట్‌తో సాగిపోయిన ఈ సినిమా ఫస్టాఫ్ కాస్త బోరింగ్ గానే నడిచింది. తన పంచ్ డైలాగ్స్ తో డైలాగ్ డెలివరీ, సూపర్ ఫైటింగ్ తో అలరించారు. పెద్దన్న సినిమాలో నయనతార హీరోయిన్ గా తన పాత్ర మేరకు నటించింది. అద్భుతమైన స్క్రీన్ ప్రజంటేషన్ తో నీట్ పర్ఫార్మెన్స్ ను అందించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. చెల్లెల్ని అమితంగా ప్రేమించే ఓ అన్న రజనీకాంత్. ఎప్పుడూ చెల్లెలి క్షేమం కోసం, ఆనందం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆమెకు ఎలాంటి హాని జరగకుండా చూస్తాడు. అలాంటి చెల్లెలు అన్న చూసిన సంబంధం కాద‌ని ఇంటి నుండి వెళ్తుంది.. ఆమె తిరిగి ఇంటికి వ‌చ్చిందా, త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘పెద్దన్న’ సినిమా సూపర్ హిట్ పక్కా అని చెబుతుండగా మరికొందరు బోరింగ్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విలన్ రోల్ పోషించిన జగపతి బాబు అదరగొట్టేశారని అంటున్నారు. అలాగే ఇమ్మాన్ కట్టిన బాణీలు సినిమాలో హైలైట్ అయ్యాయి. ద‌ర్శ‌కుడు శివ సినిమాని అనుకున్నంత‌గా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు. మొత్తానికి దీపావ‌ళికి వ‌చ్చిన ఈ సినిమా అంత‌గా పేల‌లేద‌నే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment