Raja Vikramarka : ట్రెండింగ్‌లో రాజా విక్ర‌మార్క ట్రైల‌ర్.. ఈ సారి హిట్ ప‌క్కా అంటున్న ఫ్యాన్స్..

November 3, 2021 12:14 PM

Raja Vikramarka : ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్స్ ఆఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కార్తికేయ ఆ తర్వాత అదే తరహాలో విభిన్నమైన చిత్రాలు చేసినా మంచి విజ‌యాలు రావ‌డం లేదు. దీంతో రాజా విక్రమార్క అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది.

Raja Vikramarka trailer in trending fans say hit guarantee

కార్తికేయ హీరోగా శ్రీ సారిపల్లి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కార్తికేయ కనిపించనున్నారు. తాన్యా రవిచంద్రన్‌ కథానాయిక. ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైల‌ర్‌లో కార్తికేయ నటన, లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తికేయని ఉద్దేశించి ‘వీడిది బలుపు కాదు దూల’ అని తనికెళ్ల భరణి ,‘దీపావళి.. గ్రాండ్‌గా ప్లాన్‌ చేశావ్‌’ అంటూ కార్తికేయ అలరించారు. రమణా రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు.

2.5 మిలియ‌న్ వ్యూస్ ట్రైల‌ర్‌కి ద‌క్క‌గా ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తూ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా కామెడీలో తన సరికొత్త యాంగిల్ ను చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ అయితే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి మూవీ హిట్‌ అవుతుందో, లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now