Jai Bheem Review : జై భీమ్.. న్యాయవ్యవస్థపై గౌరవాన్ని పెంచిన‌ చిత్రం..!

November 2, 2021 10:55 PM

Jai Bheem Review : సూర్య, రిజిష విజయన్, లిజో మోల్ జోస్, మణికందన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ స్వరూప్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జ్ఞాన‌వేల్ తెర‌కెక్కించిన చిత్రం జై భీమ్. ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రంలో కష్టాన్నే నమ్ముకున్న గిరిజనుడు. ఉన్నదాంట్లో కష్టపడి తన భార్యా బిడ్డల్ని పోషించుకుంటున్న అతణ్ని చేయని నేరానికి ఒక దొంగతనం కేసులో పోలీసులు ఇరికిస్తారు.

Jai Bheem Review great message oriented film

బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి కోసం మానవ హక్కుల కోసం ఉచితంగా కేసులు వాదించే చంద్రు (సూర్య)ను ఆశ్రయిస్తుంది ఆ వ్య‌క్తి భార్య‌. ఈ కేసును టేకప్ చేసిన సూర్యకు ఎదురైన అడ్డంకులు, చిక్కుముడులు ఏంటి..? రాజన్న.. మిగతా ఇద్దరు ఏమయ్యారు ? ఎవ‌రికి న్యాయం జ‌రిగింది ? అన్న‌ది సినిమా క‌థ‌.

కేవలం కమర్షియల్ అంశాలను మాత్రమే కాకుండా సొసైటీకి ఎంతో అవసరమైన ఒక హార్డ్ హిట్టింగ్ కథను సగటు ప్రేక్షకులకు కనెక్టయ్యేలా.. వాళ్లందులో లీనమయ్యేలా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. జ్ఞానవేల్ వాస్తవ ఘటనల ఆధారంగా ఒక గొప్ప కథను తీర్చిదిద్దుకుని.. దానికి పకడ్బందీ కథనాన్ని జోడిస్తే.. నిర్మాతగా.. నటుడిగా ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేశాడు సూర్య.

తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక గిరిజనుడి లాకప్ డెత్ కేసు ఆధారంగా తీర్చిదిద్దుకున్న కథ ఇది. నిస్సహాయులుగా మారిన బాధితుల కోసం చంద్రు అనే ప్రముఖ మానవహక్కుల న్యాయవాది (తర్వాత జడ్జి కూడా అయ్యారు) హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి సుదీర్ఘ కాలం పోరాడి వారికి న్యాయం చేకూరేలా చేసిన సంచలన కేసు మూలం తీసుకొని సినిమా తెరకెక్కించారు.

హీరో కేసు గురించి స్టడీ చేశాక.. కోర్టులో వాదనలు మొదలైన దగ్గర్నుంచి ‘జై భీమ్’ ఒక థ్రిల్లర్ సినిమాలా మారిపోతుంది. కోర్ట్ రూం డ్రామా రక్తి కట్టేలా ఎంతో ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ప్రతి సన్నివేశంలోనూ కొత్త విషయాలు తెలుస్తుంటాయి.

చివరి అరగంటలో ఓవైపు రావు రమేష్.. మరోవైపు ప్రకాష్ రాజ్ పాత్రలు కూడా అవసరమైన బలాన్నిచ్చాయి. చివర్లో వచ్చే హృద్యమైన సన్నివేశాలకు తోడు చక్కటి డైలాగ్స్ కూడా పడటం.. సూర్య పెర్ఫామెన్స్ కూడా అదిరిపోవడంతో ‘జై భీమ్’ ప్రేక్షకులను కదిలించేస్తుంది. జై భీమ్’ బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇది చూడదగ్గ చిత్రమే కాదు.. ఒక బాధ్యతతో తప్పక చూడాల్సిన చిత్రం. న్యాయవ్యవస్థపై ఈ చిత్రం గౌరవాన్ని పెంచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now