Shahrukh Khan : దీపాల కాంతులతో వెలుగుతున్న మ‌న్న‌త్‌.. షారూఖ్ బ‌ర్త్‌డేకి ఎవ‌రికీ లేని ఆహ్వానం..

November 2, 2021 5:08 PM

Shahrukh Khan : డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఆర్య‌న్ జైలులో ఉన్న‌న్ని రోజులూ మ‌న్న‌త్ బోసిపోయింది. ఎప్పుడైతే తమ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల అయ్యాడో ఆ సందర్భంగా షారుఖ్, గౌరీ ఖాన్‌ల ముంబైలోని ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

Shahrukh Khan mannat illuminates with lighting no guests for birthday

ప్రతీ ఏటా దీపావళి సహా పండగలు, బర్త్‌డే వంటి స్పెషల్‌ అకేషన్స్‌ లలో మన్నత్‌ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు. మ‌రి కొద్ది రోజుల‌లో దీపావ‌ళి, ఆ త‌ర్వాత షారూఖ్ బ‌ర్త్ డే వేడుక రానున్న నేప‌థ్యంలో మ‌న్న‌త్ విద్యుత్ కాంతుల దీపాల‌తో వెలిగిపోతోంది. ఇన్ని రోజుల త‌ర్వాత మ‌న్న‌త్‌కు పూర్వ వైభ‌వం వచ్చింద‌ని అంటున్నారు. ఆర్య‌న్ విడుద‌లైన స‌మ‌యంలో మ‌న్న‌త్ ద‌గ్గ‌ర అభిమానుల హంగామా ఓ రేంజ్ లో ఉంది.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలు నుండి బయటపడినా.. కేసు ఇంకా తేలలేదు. పైగా ఆర్యన్ అదే మూడ్ లో ఉన్నాడని.. అందుకే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్‌ ఖాన్‌ నిర్ణయించుకున్నారట. సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం షారూఖ్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now