Puneeth Rajkumar : పునీత్ క‌ళ్ల‌తో న‌లుగురు చూపు ద‌క్కించుకున్నారు..!

November 2, 2021 2:57 PM

Puneeth Rajkumar : క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబ‌ర్ 29న గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల  సంతాపం తెలిపారు. కొంద‌రు అభిమానులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. అంత‌లా ఆయ‌న‌పై ప్రేమ ఏర్ప‌డ‌డానికి కార‌ణం పునీత్ చేసిన మంచి ప‌నులే అని చెప్పవచ్చు.

four got eye sight with Puneeth Rajkumar  eyes

పునీత్ రాజ్ కుమార్ ఆయన కళ్ళను కూడా దానం చేశారు. గతంలో పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం దానం చేశారు. అయితే పునీత్ మ‌ర‌ణించిన రోజే ఆయ‌న‌ దేహం నుంచి కళ్లను నారాయణ నేత్రాలయ వైద్యులు సేకరించారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువతకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ భుజంగశెట్టి తెలిపారు.

సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్‌ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు. కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు డాక్టర్‌ భుజంగశెట్టి. త‌ను మ‌ర‌ణించినా.. ఆయ‌న క‌ళ్లు మ‌రో న‌లుగురికి చూపును ప్ర‌సాదించాయి. పునీత్ సేవానిర‌తి ఆయ‌న అభిమానుల‌కి ఆద‌ర్శంగా నిలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now