Bigg Boss 5 : నువ్వు ఐదారు మాస్క్‌ల‌తో క‌నిపిస్తున్నావు.. అంటూ మాన‌స్‌పై ఫైర్ అయిన శ్రీరామ్..

November 2, 2021 1:18 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్ మాదిరిగా కంటే ఈ సీజ‌న్‌లో కొంత మ‌సాలా ఎక్కువైంది. ఛాన్స్ దొరికితే గొడ‌వ‌లకు దిగుతున్నారు. మ‌రోవైపు చిత్ర విచిత్రమైన టాస్క్‌లతో హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే రకరకాల గొడవలతో రచ్చ రచ్చగా ఉన్న బిగ్ బాస్ హౌస్ తాజాగా మరోసారి హీటెక్కింది.

Bigg Boss 5 sriram angry on manas

సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేషన్ ప్ర‌క్రియ హాట్ హాట్‌గా న‌డుస్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ హౌజ్ వాతావ‌ర‌ణం వేడెక్కేలా చేస్తుంటారు. ముందు నుండి బ‌ద్ధ శత్రువులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీరామ్, మాన‌స్ మ‌రోసారి నామినేష‌న్ ప్ర్రక్రియ‌లో మాట‌ల దాడి చేసుకున్నారు. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరఖ్‌ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్‌ చేశాడు మానస్‌. నువ్వు ఉన్నా ఫరఖ్‌ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్‌.

ఆ త‌ర్వాత శ్రీరామ్.. మాన‌స్‌ని నామినేట్ చేస్తూ.. నీకు నాతో ప్రాబ్లమ్ ఏంటో అర్ధం కావడం లేదు.. నేను వెళ్లిపోతే ఫరక్ పడదని అన్నావ్.. నీతో మాట్లాడినా ప్రాబ్లమే.. మాట్లాడకపోయినా పర్లేదు.. అందరికీ ఒక్క మాస్క్ ఉంటే.. నీకు ఐదారు మాస్క్‌లు ఉన్నాయి అంటూ క్రీమ్ తీసుకుని వెళ్లి దట్టంగా పూశాడు.ఇది చూసి అంద‌రూ షాక‌య్యారు. నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా వాడివేడిగానే జ‌ర‌గగా, మొత్తం నామినేష‌న్‌లో 10 మంది ఉన్నారు. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, అనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now