Bigg Boss 5 : ఆ ఇద్ద‌రు త‌ప్ప మిగ‌తా అంద‌రూ డేంజ‌ర్ జోన్‌లోనే..!

November 2, 2021 11:08 AM

Bigg Boss 5 : చూస్తుండ‌గానే బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్రమం 58 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబ‌ర్ 5న ప్రారంభ‌మైన ఈ షోలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన‌గా ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక సోమ‌వారం జ‌రిగిన ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఏకంగా ప‌ది మంది నామినేట్ అయ్యారు. నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్‌ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్‌ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌.

Bigg Boss 5 only two are safe remaining all in danger zone

ష‌ణ్ముఖ్ కెప్టెన్ కావ‌డంతో అత‌నిని ఎవ‌రూ నామినేట్ చేయోద్ద‌ని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో మాన‌స్ ముందుగా శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేశాడు. సిరి.. సన్నీ, ఆనీ మాస్టర్‌లను నామినేట్ చేసింది. శ్రీరామ్.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. రవి.. మానస్, కాజల్‌లను నామినేట్ చేశాడు. జెస్సీ.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేసింది. సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు.

విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్ చేశాడు. కాజల్.. రవి, శ్రీరామ చంద్రలను నామినేట్ చేసింది. అనీ మాస్టర్.. సిరి, కాజల్‌లను నామినేట్ చేసింది. షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఇలా 9వ వారం నామినేషన్స్‌లో భాగంగా.. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు.

ష‌ణ్ముఖ్ కెప్టెన్ కావ‌డంతో సేఫ్‌. అలాగే అనీ మాస్ట‌ర్‌కి ద‌క్కిన ప‌వర్ కార‌ణంగా ఆమె కూడా సేఫ్ జోన్‌లోనే ఉంది. మిగ‌తా వారు డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌గా, వారికి నామినేషన్స్ నుంచి సేవ్ కావడానికి ఇమ్యునిటీ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో నామినేషన్స్‌లో ఉన్న 10 మంది పోటీ పడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment