Samantha : నానితో జ‌త క‌ట్ట‌బోతున్న స‌మంత‌.. అస‌లు విష‌యం ఇదీ..!

November 2, 2021 9:44 AM

Samantha : చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత సినిమాల స్పీడ్ పెంచిన స‌మంత ఇప్పటికే రెండు సినిమాల‌కు ఓకే చెప్పింది. ఇప్పుడు మూడో సినిమా కూడా ఒప్పుకున్న‌ట్లు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నేచుర‌ల్ స్టార్ నానితో ఆమె జోడీ క‌ట్ట‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దీనిపై క్లారిటీ వ‌చ్చింది.

Samantha acting with nani team clarified about it

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల ‘దసరా’ అనే మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా ఎంపిక కాగా, సెకండ్ హీరోయిన్‌గా సమంత కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు పుకార్ల‌ని కొట్టి పారేశాయి. సమంత సెకండ్ హీరోయిన్‌గా న‌టించదు అని అన్నారు.

చైతూతో విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాన్ని వీలైనంత త్వరగా మరిచిపోవడానికి సమంత తెగ ప్రయత్నాలు చేస్తోందట. అందుకోసమే సరదాగా తన స్నేహితులతో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే తన కేరీర్ విషయంలోనూ కొత్త అడుగులేస్తున్న సామ్.. తనకు నచ్చే కథలు వస్తే ఎలాంటి పాత్ర అయినా ఓకే అంటోంది.

స‌మంత‌.. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి.. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంలో రాబోతున్న ఓ చిత్రానికి, అలాగే తెలుగులో శ్రీదేవి మూవీస్ వారి చిత్రానికి కమిట్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఓ బాలీవుడ్ మూవీ కూడా చేయ‌నుంద‌ని టాక్. మ‌రోవైపు నాని ద‌స‌రా తెలంగాణ‌లోని కొత్త గూడెంలో షూటింగ్ జ‌రుపుకోనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment