Viral News : అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువ‌తి.. రోజుకు 30 సార్ల‌కు పైగా వాంతులు అవుతాయి..

November 1, 2021 12:54 PM

Viral News : ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది అనేక ర‌కాల అరుదైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటారు. కొన్ని వ్యాధుల‌కు చికిత్స ఉండ‌దు. కొన్నింటికి చికిత్స చేస్తే మామూలు మ‌నుషులు అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. కానీ ఆ చికిత్స చాలా ఖ‌ర్చుతో కూడుకుని ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఓ యువ‌తి అలాంటి ఖ‌రీదైన చికిత్స చేయించుకునేందుకు గాను అవ‌స‌రం అయ్యే డ‌బ్బు కోసం.. దాన్ని స‌హాయంగా ఇచ్చే దాత‌ల కోసం ఎదురు చూస్తోంది.

Viral News this girl suffering from rare disease vomits 30 times a day

యూకేలోని ఇంగ్లండ్‌లో ఉన్న లీడ్స్ అనే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఎమిలీ వెబ్‌స్ట‌ర్ కు ఓ అరుదైన వ్యాధి ఉంది. ఆమె 2016లో తీవ్ర‌మైన అనారోగ్యానికి గురైంది. అప్ప‌టి నుంచి ఆమె రోజుకు 30 సార్ల‌కు పైగానే వాంతులు చేసుకుంటుంది. ఈమెకు ఉన్న వ్యాధిని వైద్య ప‌రిభాష‌లో గ్యాస్ట్రోపారెసిస్ అంటారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు రోజూ అదే ప‌నిగా వాంతులు అవుతుంటాయి.

అయితే ఈ వ్యాధి అత్యంత అరుదైన‌ద‌ని యూకేకు చెందిన వైద్య నిపుణులు తెలిపారు. యూకేలో 6 శాతం మందికి ఇలాంటి స‌మ‌స్య వ‌స్తోంద‌ని, దీంతో జీర్ణాశ‌యం పాక్షికంగా ప‌క్ష‌వాతం బారిన ప‌డుతుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే తినే ఆహారం, తీసుకునే ద్ర‌వాలు కింద‌కు వెళ్ల‌క‌.. వాంతుల రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని తెలిపారు. అయితే ఈ వ్యాధికి శ‌స్త్ర చికిత్స చేయ‌వ‌చ్చు. దీంతో స‌మస్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

కానీ ఎమిలీకి శ‌స్త్ర చికిత్స చేసేందుకు 9,500 పౌండ్లు (దాదాపుగా రూ.9 ల‌క్ష‌లు) అవ‌స‌రం. కానీ అంత మొత్తం ఆమె ద‌గ్గ‌ర లేదు. దీంతో ఆమె సోష‌ల్ మీడియాలో ఫండ్ రైజ‌ర్ ను ప్రారంభించింది. ఆమెకు న‌వంబ‌ర్ 11న శ‌స్త్ర చికిత్స చేస్తామ‌ని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అప్ప‌టి వ‌ర‌కు ఎలాగైనా స‌రే ఆ మొత్తాన్ని సేకరించాల‌ని చూస్తోంది. ఈ వ్యాధి వ‌ల్ల ఆమె ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు బరువు త‌గ్గింది. ప్ర‌స్తుతం ఆమె బ‌రువు 31 కిలోలుగా ఉంది. అయితే శ‌స్త్ర చికిత్స జ‌రిగితే మ‌ళ్లీ మామూలుగా అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె స‌ర్జ‌రీ కోసం ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now