Puneeth Rajkumar : తమిళ హీరోలపై పునీత్ ఫ్యాన్స్ ఆగ్రహం..!

November 1, 2021 7:37 PM

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు, దివంగత పునీత్ కుమార్ మరణం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన హఠాత్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడి మరణవార్త విన్న ఎందరో అభిమానుల గుండెలు కూడా ఆగిపోయాయి. పునీత్ మరణవార్తను తెలుసుకున్న సినీ ప్రపంచం ఆయనకు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించింది.

Puneeth Rajkumar  fans angry over tamil heroes

ఇక పునీత్ కి తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలతో ఎంతో మంచి సంబంధం ఉంది. తెలుగు, తమిళ హీరోలు నటించిన సినిమాలు కన్నడంలో విడుదలయ్యి మంచి వసూళ్లను రాబడుతాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పునీత్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అనుబంధంతోనే తెలుగు హీరోలు పునీత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ మిత్రుడి ఆఖరి చూపు కోసం చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి ప్రముఖులు బెంగళూరుకు చేరుకొని తమ మిత్రుడిని కడసారి చూసుకుని వీడ్కోలు పలికారు.

అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది హీరోలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నటుడి పట్ల తెలుగు హీరోలు చూపిస్తున్న ప్రేమను చూసి కన్నడ అభిమానులు ఎంతో ముచ్చట పడ్డారు.

ఈ క్రమంలోనే పునీత్ అభిమానులు తమిళ హీరోల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు పునీత్ కి తమిళంలో కూడా ఎంతో మంచి మిత్రులు ఉన్నారు. వారి సినిమాలు కూడా ఇక్కడ విడుదలవుతుంటాయి. అలాంటిది ఒక స్టార్ హీరో మృతి చెందితే ఏ ఒక్క తమిళ హీరో కూడా ఆయన కడచూపు కోసం బెంగుళూరుకు రాలేదంటూ తమిళ హీరోలు అందరూ ఎక్కడ..? అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కన్నడలో తమిళ హీరోల సినిమాలను బాయ్‌కాట్ చేస్తామంటూ పునీత్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now