Naga Shourya : నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట రాయుళ్లు.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న పోలీసులు..

November 1, 2021 11:57 AM

Naga Shourya : కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టైమ్ బ్యాడ్ అయితే అంతే మరి. సరిగ్గా ఇదే తీరు నాగశౌర్య విషయంలోనూ జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో జరిగిన ఓ సంఘటన నాగశౌర్య ఇమేజ్ ను డ్యామేజ్ చేసే స్థాయికి తీసుకెళ్ళింది. శౌర్య నాన్న, బాబాయిలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. అందుకోసం ఓ ఫామ్ హౌస్ ని తీసుకున్నారు. లే అవుట్స్ అమ్మకాలు, ప్లానింగ్ కి సంబంధించిన లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఈ భవనానికి తాళం వేసి కింద ఫ్లోర్ లో ఉన్న ఓనర్స్ దగ్గర ఉంచారు. బర్త్ డే పార్టీకి కావాలని నాగశౌర్య బాబాయ్ ఫ్రెండ్ ఆయన్ని అడగడంతో చూద్దాంలే అని చెప్పారు.

Naga Shourya farm house playing cards raid by police men arrested

కానీ వాచ్ మెన్ దగ్గరున్న చనువుతో ఓనర్ దగ్గర తాళాలు తీసుకుని ఓ రేంజ్ లో పేకాట మొదలు పెట్టారు. ఈ విషయంపై అంతర్గతంగా వాట్సాప్ ల్లో ఇక్కడ పార్టీ జరుగుతుందని ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేశారు. ఈ క్రమంలో పేకాట రాయళ్ళంతా ఒకే చోటకు చేరి తమ ప్రతిభ చూపించారు. ఈ విషయం ఎలాగో మీడియాకు, పోలీసులకు చేరడంతో రెయిడ్ నిర్వహించారు. ఈ క్రమంలో నాగశౌర్య ఫామ్ హౌస్ పరిసరాల్లో నాగ శౌర్య ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకపోవడం మంచిదైంది.

తాళాలు కూడా వాచ్ మెన్ నుండి తీసుకోవడం జరిగింది. నాగ శౌర్య ఫామ్ హౌస్ నుండి అతని పర్సనల్ కెరీర్ వరకు అన్ని విషయాల్ని బయటకు లాగారు. ఈ క్రమంలో అసలు నాగశౌర్యకు పర్సనల్ ఫామ్ హౌస్ లేదు.. విల్లా అంతకన్నా లేదనే విషయం తేలింది. ఏది ఏమైనా తాము అద్దెకు తీసుకున్న ఫామ్ హౌస్, ఆఫీస్ తాళాలు వారి దగ్గర ఉంచుకోకుండా.. వేరే ఎవరికో ఇవ్వడం.. నిర్లక్ష్యం వహిస్తే ఇలానే జరుగుతుందని అంటున్నారు నెటిజన్లు. అనవసరంగా ఈ విషయంలోకి నాగ శౌర్యను హైలెట్ చేయడం బాధాకరం అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now