T20 World Cup 2021 : ఐపీఎల్‌ను బ్యాన్ చేయండి.. భార‌త ప్లేయ‌ర్ల‌పై దారుణ‌మైన ట్రోలింగ్‌..!

October 31, 2021 11:18 PM

T20 World Cup 2021 : న్యూజిలాండ్ చేతిలో భార‌త్ దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకోవ‌డంతో భార‌త్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. ఐసీసీ టోర్నీల్లో మొద‌టి రౌండ్‌లోనే వెను దిర‌గ‌డం.. 2007 త‌రువాత ఇదే ప్ర‌థ‌మం. దీంతో అభిమానుల ఆగ్ర‌హ జ్వాల‌లు మిన్నంటుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ఐపీఎల్ ను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున #BanIPL అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

T20 World Cup 2021 IPL should be banned indian fans angry on players

మొద‌టి మ్యాచ్‌నే ఓట‌మితో ప్రారంభించిన భార‌త్‌కు మొద‌ట్లో అభిమానులు మ‌ద్ద‌తుగానే నిలిచారు. కానీ న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లోనూ భార‌త ప్లేయ‌ర్ల ఆట‌తీరు ఏమాత్రం మార‌లేదు. ఇంకా పాక్‌తో ఆడిన మ్యాచే న‌యం అనిపిస్తుంది. అందులో కొంత వ‌ర‌కు పోరాడారు. కానీ న్యూజిలాండ్‌తో మాత్రం మా వ‌ల్ల కాదు, అని పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భార‌త్‌ను కివీస్ చిత‌క్కొట్టేసింది. ఈ క్ర‌మంలో భార‌త్ మొద‌టి రౌండ్ ఆడి ఇంటికి రాక త‌ప్ప‌డం లేదు.

https://twitter.com/ArslanK97624701/status/1454864617381974019

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021లో భార‌త జ‌ట్టు అత్య‌ద్భుతంగా ఉంద‌ని, క‌ప్ వ‌స్తుంద‌ని, గ్యారంటీ అని అనుకున్నారు. కానీ అంద‌రికీ షాక్ ఇచ్చింది టీమిండియా. పాక్‌తో ఓడిన త‌రువాత న్యూజిలాండ్‌తోనూ అదే ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. అత్యంత బాధ్య‌తా రాహిత్యంగా ప్లేయ‌ర్లు మ్యాచ్‌లో ఆడారు. చెత్త షాట్లు ఆడి వికెట్ల‌ను అన‌వ‌స‌రంగా పారేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఐపీఎల్‌ను బ్యాన్ చేయాల్సిందేనంటూ.. భార‌త ప్లేయ‌ర్ల‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

https://twitter.com/catharsiss__/status/1454864581151666178

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now