Romantic Movie : బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న రొమాంటిక్‌..!

November 1, 2021 8:18 AM

Romantic Movie : పూరీ జగన్నాథ్ తనయుడు .. ఆకాష్ పూరీ, కేతిక శర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన‌ లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’ . ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. రొమాంటిక్ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది.

Romantic Movie getting good collections at box office

ఇక ఈ సినిమా రెండో రోజు రూ.60-70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టింది. రొమాంటిక్ రెండో రోజు రూ.83 లక్షల వరకు షేర్ సాధించింది. సినిమా రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ రూ.4.6 కోట్లు అయ్యాయి. ఈ సినిమా రూ.5 కోట్ల రేంజ్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమా 2 రోజుల్లో రూ.2.48 కోట్ల షేర్‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.2.52 కోట్ల షేర్‌ని అందుకోవాల్సి ఉంది.

రొమాంటిక్.. సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరీ, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది. రమ్యకృష్ణ చిత్రంలో ఆకాష్ పూరీకి అత్త పాత్రలో కనిపించింది. వీరితోపాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరీ కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment