Bigg Boss 5 : ఈ రోజు బిగ్ బాస్ వేదిక‌పై తార‌ల సంద‌డి.. శ్రియ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ, సుమ ర‌చ్చ చేయ‌బోతున్నారు..

October 31, 2021 1:15 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం చాలా ఎనర్జిటిక్‌గా సాగుతోంది. పండుగ‌ల సంద‌ర్భంగా ఈ షో నిర్వాహ‌కులు కార్యక్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా మూడు గంట‌ల పాటు సాగిన ఎపిసోడ్‌లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద‌క్కింది. ఇక ఈ రోజు దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.

Bigg Boss 5  vijay devarakonda and other stars to entertain audience

దీపావళి సందర్భంగా బిగ్ బాస్ మేకర్స్ సర్ ప్రైజ్ గెస్ట్స్ తో వీక్షకులను అలరించబోతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు హీరోయిన్ శ్రియ‌, యాంక‌ర్ సుమ‌, దివి, అవినాష్, అరియానా, గాయని కల్పన, సోహెల్, ప‌లువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించబోతున్నారు.

నేటి సాయంత్రం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో సుమ.. నాగార్జున‌పై వేసిన పంచ్‌లు, క‌ల్పన సింగ‌ర్స్‌ని ఉద్దేశించి పాడిన పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్రోమోని బ‌ట్టి చూస్తుంటే దీపావళి సంద‌ర్భంగా చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ రోజు నామినేష‌న్ లో ఉన్న వారిలో లోబో హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now