Bigg Boss 5 : బిగ్ బాస్‌కి బైబై చెప్పిన లోబో.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌నే..!

October 30, 2021 11:27 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం 19 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మ‌రొక‌రు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఎనిమిదో వారంలో రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జస్వంత్‌, మానస్ నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ర‌వి, శ్రీరామ్, మాన‌స్‌, ష‌ణ్ముఖ్‌, సిరిలు టాప్ 5లో ఉంటార‌నే అభిప్రాయం అంద‌రిలో ఉంది.

Bigg Boss 5  lobo eliminated from house say sources

టాప్ 5లో ఉన్న ఐదుగురు ఎలాగూ ఎలిమినేట్ కారు కాబ‌ట్టి బ‌లి అయ్యే వ్య‌క్తి లోబో అని ముందే ఊహించారు. అనుకున్న ప్ర‌కారమే లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్ ముందే జ‌రుగుతుంది కాబ‌ట్టి లీకు వీరుల స‌మాచారం ప్ర‌కారం లోబో హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాడ‌ని అంటున్నారు. అంద‌రి కన్నా లోబోకి త‌క్కువ ఓట్స్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఏడు వారాల్లో ఆరుగురు అమ్మాయిల‌ను పంపించి వేసిన బిగ్ బాస్ ఈ సారి అబ్బాయిని ఎలిమినేట్ చేయ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎలిమినేష‌న్ అయిన వారిలో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ త‌ప్ప మిగ‌తా వారందరు అమ్మాయిలే. ఈ వారం లోబో చాలా వీక్‌గా క‌నిపించ‌గా, సీక్రెట్ రూం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌నిలో జోష్ త‌గ్గింద‌ని చెబుతున్నారు. సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత కాస్త ఎక్కువ తింటూ కనిపించాడు తప్పితే కంటెంట్ పరంగా ఒరిగింది ఏమీ లేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ తరువాత కూడా లోబో పూర్తిగా డల్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎలిమినేట్ అయ్యాడ‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now