T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో శ్రీ‌లంక‌పై సౌతాఫ్రికా విజ‌యం

October 30, 2021 7:19 PM

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 25వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై సౌతాఫ్రికా గెలుపొందింది. శ్రీ‌లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా క‌ష్ట‌ప‌డి ఛేదించింది. దీంతో లంక జ‌ట్టుపై సఫారీలు 4 వికెట్ల తేడాతో గెలుపొందారు.

T20 World Cup 2021 south africa won by 4 wickets against srilanka in 25th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీ‌లంక బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 142 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. లంక బ్యాట్స్‌మెన్‌ల‌లో ప‌తుమ్ నిస్సంక 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 72 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకోగా.. చరిత అస‌లంక 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 21 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించాడు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో తబ్రెయిజ్ శంషీ, డ్వానె ప్రిటోరియ‌స్‌లు చెరో 3 వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌గా అన్‌రిక్ నోర్‌జె 2 వికెట్లు తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 19.5 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల‌ను కోల్పోయి 146 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ల‌లో టెంబా బ‌వుమా 46 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స‌ర్‌తో 46 ప‌రుగులు చేయ‌గా.. డేవిడ్ మిల్ల‌ర్ 13 బంతుల్లో 2 సిక్స‌ర్‌ల‌తో 23 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. లంక బౌల‌ర్ల‌లో వ‌నిందు హస‌రంగ డిసిల్వ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రో బౌల‌ర్ దుష్మంత చ‌మీర 2 వికెట్లు తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now