Aryan Khan : ఎట్ట‌కేల‌కు జైలు నుంచి విడుద‌ల అయిన ఆర్య‌న్‌ఖాన్‌.. షారూఖ్ ఇంట వేడుక‌లు..

October 30, 2021 4:23 PM

Aryan Khan : డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ చేత నిందితుడిగా అరెస్టు చేయ‌బ‌డిన ఆర్య‌న్ ఖాన్ ఎట్ట‌కేల‌కు జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. షారూఖ్ స్వ‌యంగా వ‌చ్చి త‌న కుమారున్ని ముంబై ఆర్థ‌ర్ రోడ్ జైల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. దాదాపుగా ఆర్య‌న్ 4 వారాల‌కు పైగానే జైలులో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ప‌లు మార్లు అత‌ను పెట్టుకున్న బెయిల్ ద‌ర‌ఖాస్తుల‌ను కూడా కోర్టు తిర‌స్క‌రించింది.

Aryan Khan released from jail and gone straight to home

అయితే ఆర్య‌న్ కు బెయిల్ ఇచ్చిన‌ప్ప‌టికీ కోర్టు 14 ష‌ర‌తుల‌ను విధించింది. ఈ క్ర‌మంలోనే షారూఖ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా బెయిల్‌కు అయ్యే పూచీక‌త్తును స‌మ‌ర్పించ‌డంతోపాటు ఆర్య‌న్ ఏం చేసినా త‌న‌దే బాధ్య‌త అని ష్యూరిటీ సంత‌కం కూడా చేసింది.

ఇక శ‌నివారం ఉద‌యం షారూఖ్ ఖాన్ త‌న లాయ‌ర్ల‌తో క‌లిసి జైలుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో కొన్ని గంట‌ల పాటు వేచి చూశారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక మ‌ధ్యాహ్నం ఆర్య‌న్‌ను జైలు నుంచి విడుద‌ల చేశారు. భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల‌తో జైలు వ‌ద్ద ప్ర‌త్యేక పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించి బందోబ‌స్తును పెంచారు.

అయితే మీడియాతో మాట్లాడ‌డం ఇష్టం లేని షారూఖ్ ఖాన్ జైలు ప్ర‌ధాన ద్వారం వ‌ద్దే త‌న వైట్ రేంజ్ రోవ‌ర్‌ను సిద్ధంగా ఉంచారు. దీంతో జైలు నుంచి ఆర్య‌న్ బ‌య‌ట‌కు వ‌స్తూనే నేరుగా కార్ ఎక్క‌గా.. కారు అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఇక ఆర్య‌న్ విడుద‌ల కావ‌డంతో షారూఖ్ ఖాన్ నివాసం మ‌న్న‌త్ వ‌ద్ద కోలాహ‌లంగా మారింది. అంద‌రూ వేడుక‌లు జ‌రుపుకున్నారు. బాణ‌సంచా కాల్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now